Thursday, January 10, 2008

ఓ మనసా...తిరిగి రా!



నీకంటూ స్థానం లేని
అతని ఎదనే చేరాలని
మనసా...నీకెందుకే ఇంత తపన!
తీరం తాకని త్రోవనె వెళుతూ
పడుతున్నావెందుకింత యాతన
గమ్యం చేర్చని ఆ పయనం
గమనించదెపుడూ నీ ఆవేదన
గుర్తించనే లేదు నువ్వు
అతని ప్రేమ గతించిపోయిన ఒక నిన్న
గడువు తీరిన ఆ ప్రేమ కోసం
నువు చేస్తున్న ఈ నివేదన
గగనంలో కలిసిపోతున్న అరణ్య రోదన!
గడప దాటెళ్ళావని గర్జించను నిను ఇకపైన
గాయ పడిన ఓ మనసా...తిరిగిరా ఇకనైనా!