Tuesday, July 31, 2007

మేఘ సందేశం


నీవు లేని ఏకాంతంలో
నిదురే రాని నిశి రాతిరిలో
కదలిక మరచిన కాలంతో
బదులు పలకని శూన్యంతో
అలుపెరగని తలపులతో
అల్లరి చేసే ఊహలతో
చేస్తోంది మనసు సమరం
చేరలేక నీ హృదయ ద్వారం
పంపాను మేఘాలతో సందేశం
మన్నించి దరిచేరవా నేస్తం!

9 comments:

Anonymous said...

మీ బ్లాగ్ చాలా బావుంది. నాకు తెలుగు లో బ్లోగ్ మొదలు పెడదామని ఉంది. తెలుగు లో వ్రాయడానికి www.quillpad.in/telugu కన్నా మంచి సాఫ్ట్‌వేర్ ఉంటే చెప్ప్పండి. అంటే ఇది చాలా బావుంది కానీ మీరు చాలా రోజుల నుంచి వాడుతున్నారు కాబట్టి మీకు తెలుస్తుంది కదా.

Ravi said...
This comment has been removed by the author.
Ravi said...

మీ బ్లాగ్ చాలా బావుంది.
శ్రీకాంత్,

నేను Firefoxవారి 'పద్మా' అనే add-on extension వాడుతున్నాను. ఈ add-on ద్వారా Firefox web browserలో ఏ పేజీ అయినా తెలుగులో type చేయవచ్చు. Ms-Office, notepad మరియు wordpad applicationsలో Windows-XP/Regional and Language support options వుపయోగించడం వలన తెలుగులో type చేయగలుగు తున్నాను.మీకు ఈ సమాచారం ఉపయోగ పడుతుందని తలుస్తాను.
- రవి

హృదయ బృందావని said...

@శ్రీకాంత్ గారు

నా బ్లాగ్ బాగుందని చెప్పినందుకు థాంక్యూ వెరీమచ్. నేను ప్రస్తుతం బ్లాగ్ రాయడానికి lekhini.org వాడుతున్నాను. Quillpad ఇప్పుడే చూశాను. ఇది కూడా బాగుంది. థాంక్యూ. :)

@రవి గారు!

Thank U for your compliments. :)

మీరు చెప్పిన firefox పద్మా tool గురించి ఇంకొంచం వివరంగా చెప్పగలరా?

రాధిక said...

చాల మంచి ఎక్ష్స్ ప్రెషన్స్.సున్నితం గా బాగా చెప్పారు.

తెలుగు'వాడి'ని said...

చాలా చక్కని కవిత ... హృద్యంగా చెప్పారు.....అభినందనలు....

Abhijit said...

చాలా మంచి కవిత.. brundaa garu

Abhijit said...

brundaa garu mee nxt posting kosam yeduru choosthou


mee shreyobhilashi

Abhi

Anonymous said...

awesome gaa rasaru...wording excellent....
I literally feel like that..... 7years+