Tuesday, November 6, 2007

కన్నీటి స్నేహం~కాలంతో పయనం


ఎదురవుతావన్న ఆశ లేదు
ఎదురీతకి దారి లేదు
ఎదురించే శక్తీ లేదు
ఎద భారం చేసిన ప్రేమ మాత్రం మిగిలే వుంది
ఎదురుచూపులోనే యుగాలు గడిపేస్తోంది
ఏ తోడూ అందిరాక
ఎడబాటుకే బంధువై
ఏ నీడా కానరాక
ఎండమావికి చేరువై
గుండెకోత మిత్రునితో
కన్నీటి స్నేహం చేస్తూ
కాలంతో కలిసి పయనిస్తోంది

7 comments:

Unknown said...

wowwwwww..poem with super picture..:) keep it up radhaa..:)

Anonymous said...

bru nee peoms nee pics chala chakaga match avutayi ...gud work bru bagundi poem..ento teliyakundane kala venta kaneelu vachesayi..
anju

through the pages of life said...

గుండె కోత మిత్రునితో స్నేహం, అభినందనీయం ఈ ఆలోచన.చాలా అందంగా పెట్టారు మీ ఆలోచనలని.Keep going

రాధిక said...

మొదటి రెండు లైన్లు కళ్ళను ఆపేసాయి.చాలా బాగా రాసారు.

రాధిక said...

రాధా...మీ బ్లాగు కూడలిలో లేదనుకుంటాను.కామెంట్లు కనిపిస్తున్నాయిగానీ టపాలు కూడలిలో రావట్లేదు.కామెంటు కనపడి కొత్త కవిత రాసినట్టున్నారని ఇటు వచ్చాను.ఒక సారి చెక్ చేయండి.ఒక వేళ నేనే మిస్ అవుతూ వుండుంటే నాకు చెప్పండి.

హృదయ బృందావని said...

thank u very much Purna, Anju, Jags and Radhika garu :)

David said...

excellent .................