Thursday, January 10, 2008
ఓ మనసా...తిరిగి రా!
నీకంటూ స్థానం లేని
అతని ఎదనే చేరాలని
మనసా...నీకెందుకే ఇంత తపన!
తీరం తాకని త్రోవనె వెళుతూ
పడుతున్నావెందుకింత యాతన
గమ్యం చేర్చని ఆ పయనం
గమనించదెపుడూ నీ ఆవేదన
గుర్తించనే లేదు నువ్వు
అతని ప్రేమ గతించిపోయిన ఒక నిన్న
గడువు తీరిన ఆ ప్రేమ కోసం
నువు చేస్తున్న ఈ నివేదన
గగనంలో కలిసిపోతున్న అరణ్య రోదన!
గడప దాటెళ్ళావని గర్జించను నిను ఇకపైన
గాయ పడిన ఓ మనసా...తిరిగిరా ఇకనైనా!
Subscribe to:
Post Comments (Atom)
19 comments:
radhaaa....chala baavundhi nee kavitha.....:)
"గమ్యం చేర్చని ఆ పయనం
గమనించదెపుడూ నీ ఆవేదన" caalaa baagaa ceppaau.total gaa simple ga super ga vundi.
ohhh entha daggari bhavam odipoyina mansu chese rodana antha mee tirigiraa manasaa lo kanipinchindi
nijangaa chalaa bagundi andi
radhika garu cheptunattu ga same ave lines chala beautiful ga vunayi...and beautifl meaning radha chala bagundi simply superb:)
inka picgurinchi chepanakarledu nee opikaku na joharlu :)
anju
good one! keep it up!
భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ మొత్తంగా అన్నిటి హోల్ సేల్ శుభాకాంక్షలు.
హృదయ బృందావని గారు : మీ కవిత హృదయానికీ, అందులోనుంచి బృందమై వచ్చే కవితలన్నీ ఈ అవని లో ఉన్న మా డెందాలపై ఓ ఆనందపు విరిజల్లును కురియిస్తున్నాయి...అందుకు నిజంగా నా హృదయపూర్వక అభినందనలు....
ఒక ప్రశ్న : మీ మొదటి పేజ్ (మిగతావి ఇంకా చదవలేదు లేండి) లో ఉన్న కవితలన్నీ , స్నేహాన్నో, ప్రేమనో లేక మరో బంధాన్నో లేక నమ్మకాన్నో లేక అనుభూతినో పోగొట్టుకుంటేనో లేక దూరమైతేనో ... అనే దాని చుట్టూ తిరుగుతున్నాయి .... ప్రత్యేక కారణం ఏమైనా ఉందా :-)...అంటే విషాదముంటేనే కవిత పుడుతుందా (తేలికగా/తొందరగా)...అంటే విషాదమాధ్యమమైతేనే పదాల అల్లిక సులభమవుతుందా ... లేక విషాదముంటేనే మనసుకు హత్తుకుంటుందా లేక హత్తుకునేలా చెప్పగలమా ...
నాకెందుకో వీటన్నింటికీ 'కాదు' అనే అనిపిస్తుంది...మీలా, రాధిక గారిలా అలాగే తెలుగు బ్లాగ్లోకంలో ఉన్న మరికొంత మందిలా ఒక అనుభూతితో, స్పందనతో వ్రాయగల వారికి ఏ మాధ్యమమైనా ఇవతలి వారి జ్ఞాపకాల తలుపు తట్టేలా, మదిపొరలకు హత్తుకునేలా, అనుభూతుల సంద్రంలో తడిసేలా చెప్పగలరనటంలో నాకు ఎలాంటి సందేహం లేదు
అలాగని ఈ కవితలు వ్రాయటం వెనుక మీ కష్టాన్ని తక్కువ చేయాలన్నది నా అభిమతం కాదు సుమండీ .. అపార్ధం చేసుకోకండి ... అలాగే ఈ ప్రశ్న మీ ఒక్కరికే కాదు .. కవితలు రాసే చాలా మందికి....
వీలుంటే అంతా ఆనందమయమైన ఒక కవితను వ్రాయండి మరియు/లేదా ఇంతకు ముందు వాటిలోవి కొన్ని సూచించండి....
మరొక్క సారి అభినందనలతో ....
హృదయబృందావని గారు,
"తీరం తాకని త్రోవన వెళ్తూ....
గమ్యం చేర్చని ప్రయాణం..."
ఈ రెండు వాక్యాలలో ఎంత నిజముంది కదండీ అసలు. మరచిపోవటం మనసుకి తెలీదు..ఒకవేళ ఎవరైనా మర్చిపోయాను అని చెప్తే అతని/ఆమె మనసు మారిపోయింది అని చెప్పటం ఉచితమనిపిస్తుంది.
"గడప దాటి వెళ్ళావని గర్జించను..."
తనవాళ్ళని క్షమించటం మన రక్తంలోనే ఉంది కదా..!మనసు మీద మీ మమకారం బాగుంది.
@ Pranu, Radhika, Usha, Anju
Thank you all for your compliments :)
@Vishwanath
Thank you for the wishes andi :)
@తెలుగు 'వాడి 'ని
మీ అభినందనలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు :)
ఇక మీ ప్రశ్నకి నా జవాబు :
నా కవితలకి ప్రత్యేకమైన కారణం అంటూ ఏమీ లేదండి. అసలు అవి కవితలు అని కూడా నేను అనను. మదిలో పుట్టిన భావాల/భావనల కి కొద్దిగా ప్రాస జత చేసి రాస్తున్నాను అంతే.
మరి అవి విషాదమైనవే ఎందుకు కావాలి, సంతోషకరమైనవి ఎందుకు కాకూడదు, సంతోషమైన భావాలే కలగవా మీలో అంటారు...
ఇదే ప్రశ్న చాలా సార్లు face చేసాను. మరి నా జవాబు సరైనదో కాదో తెలీదు కాని.....
నాకు సంబంధించినంత వరకు హృదయం అనేది సంతోషానికి, బాధకి రెండిటికీ స్పందించినప్పటికీ బాధ ఎప్పుడూ సంతోషాన్ని dominate చేసేస్తుంది. ఒక చిన్న బాధ కొండంత సంతోషాన్ని ఇట్టే నీరు గారుస్తుంది. కానీ ఎంతటి సంతోషం కూడా బాధని పూర్తిగా అణిచివేయలేదు....బాధ తాలూకు జ్ఞాపకాలు ఇంకా ఎక్కడో దాగే వుంటాయి/కలవరపెడుతూనే ఉంటాయి మనసులో ఎపుడూ. అటువంటి కలవరం నుండే ఇటువంటి కవితలు పుడుతుంటాయన్నది నా అభిప్రాయం. అందుకేనేమో కవితల్లో ఎక్కువ శాతం విషాదమాధ్యమమైనవి/విరహపూరితమైనవి కనిపిస్తాయి. (ofcourse it depends on the way of thinking/feeling of each person). నేను కేవలం నా వ్యక్తిగతమైన అభిప్రాయం చెప్పాను అంతే.
మీరు చెప్పినట్టు అనుభూతుల సంద్రంలో తడిసేలా ఆనందమయమైన కవితలు రాయాలన్నది నా ఆశ కూడా....చూద్దాం ఎప్పటికైనా నా కలం(హృదయం) అందుకు సహకరిస్తుందో, లేదో :)
@jags
thank you
మనసుకి జీవం ఆ మమకారమే కదండీ :)
హృదయ బృందావని గారు : మీ సమాధానానికి, అందుకు మిరు వెచ్చించిన సమయానికి ముందుగా నా హృదయపూర్వక కృతజ్ఞతాభినందనలు..
మీ జవాబు సరైనదో కాదో అనే ప్రసక్తే లేదండీ ఇక్కడ .. మీ అభిప్రాయం/విశ్లేషణ ఏమిటన్నదే ముఖ్యం ...
అధ్బుతమైన విశ్లేషణ ... చక్కని సమాధానం :-)
వీలైనంత తొందరలో మీ ఆశ నెరవేరాలనీ అందుకు మీ కలం(హృదయం) సహకరించాలనీ ... మనస్ఫూర్తిగా కోరుకుంటూ .....
మరొక్కసారి అభినందనలతో
తెలుగు'వాడి'ని
రాధిక మీరు అంత చక్కటి కవితలు అదీ భావాలూ మాత్రమే కాకుండా చిత్రాలని కుడా చాలా చక్కటివి ఎంచి మరీ తయారు చేసిన మీరే అలా ఎమోషనల్ అయ్యారు అంటే ఇంక నా ఆనందానికి పట్టా పగ్గాలు ఉంటాయా ?
నిజంగా నేను మీ కామెంటు చూసిన దగ్గర నుండి చాలా సంతోషం గా ఉంది అండి మీ ఆనిముత్యాల ముందు నా కవితలేపాటి ఐనా కూడా చాలా ఆనందం కలుగుతుంది
థాంక్స్
ఉష
http://usha-poetry.blogspot.com/
రాధిక మీరు అంత చక్కటి కవితలు అదీ భావాలూ మాత్రమే కాకుండా చిత్రాలని కుడా చాలా చక్కటివి ఎంచి మరీ తయారు చేసిన మీరే అలా ఎమోషనల్ అయ్యారు అంటే ఇంక నా ఆనందానికి పట్టా పగ్గాలు ఉంటాయా ?
నిజంగా నేను మీ కామెంటు చూసిన దగ్గర నుండి చాలా సంతోషం గా ఉంది అండి మీ ఆనిముత్యాల ముందు నా కవితలేపాటి ఐనా కూడా చాలా ఆనందం కలుగుతుంది
థాంక్స్
ఉష
http://usha-poetry.blogspot.com/
RAdha, mee next kavita epudu upload chestunnaru...
kotha inka any new postings....
Hello. This post is likeable, and your blog is very interesting, congratulations :-). I will add in my blogroll =). If possible gives a last there on my blog, it is about the Pen Drive, I hope you enjoy. The address is http://pen-drive-brasil.blogspot.com. A hug.
radha.....kavita raayamdi.edurucuustunnaam.
O Radha tirigi raa!
O Radha, tirigi raavadu, be happy with your Good Manasu and try make it more Merry and Happy.
All the Best.
Abhi
& Kabhi Bhi Be
gr8!!
Post a Comment