Tuesday, September 18, 2007

తిరిగొచ్చిన తిమిరం



ఉషస్సుతో వచ్చావు
మనస్సులో నిలిచావు
ఆశలెన్నో రేపావు
నా ప్రతీ శ్వాశలోనూ చేరావు
ఊసులెన్నో చెప్పావు
నా ఊహలకు ఊపిరిని పోసావు
బాసలెన్నో చేశావు
బంధమేదో కలిపావు
బాధలన్నీ మరచి
నీ ఎదపై తలవాల్చి
సేదదీరమన్నావు
భారం తీర్చుకునే వేళకి మాత్రం
దూరంగా వెళ్ళిపోయావు
తిరిగి మదిలో తిమిరం నింపావు

11 comments:

Anonymous said...

Radhaaa...:)

manchi kavithaa..heart melted gaa vundhii...thank you.

విహారి(KBL) said...

really nice poetry.

Sri said...

chala bagundi ....manasu anedi vinthaina prapancham .....andulo enni sangatulo....very nice

Anonymous said...

మెరిసింది మెరుపు
ఉరిమింది ఉరుము
పాడింది కోకిల
సుధలెన్నొ చిలికింది.
గుండెల్లో కవితా గునపం గుచ్చావు.

హృదయ బృందావని said...

thank u Purna, vihaari, sri :)

@anonymous
నా గుండెల్లో గునపాన్ని తీసుకోబోయాను, అది మీకు గుచ్చుకుందా, సారీ :)

Anonymous said...

hey Radha chalaaaaaa bagundhee very touchy poetry kani oka word meaning ardham kaaledu
తిమిరం antee yenti ????

Suma

హృదయ బృందావని said...

thank u Suma :)

తిమిరం అంటే చీకటి అని అర్దం

Anonymous said...

కవితలో ఎంతో ఆర్ద్రత దాగుంది. కవితకి జత చేసిన చిత్రం ద్వారా మీ భావాన్ని మరింత స్పష్టంగా వ్యక్త పరిచారు. అభినందనలు.

Unknown said...

nice poetry. ekkado touch chesaru

anjali said...

hi bruu,
chala bagundi ra ne poetry .don't have enough words to express it..thankyou
anju

Bolloju Baba said...

కవిత బాగుంది, ఫొటో ఇంకా అదిరింది.